15, ఆగస్టు 2019, గురువారం

నా గురించి...

నా గురించి...
 
నమస్కారం. 
       నా పేరు పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు. (P.V.L. KANTHA RAO).
        ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ముప్ఫై సంవత్సరాలు పని చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను. 
       చిన్నప్పటి నుండి తెలుగు భాష అంటే ప్రీతి. సంస్కృతం నేర్చుకోవాలనే కోరిక ఉంది.       అది కొంత వరకు తీరింది.
       తెలుగు సాహిత్యంలో ఎన్నో పద్య కావ్యాలు ఉన్నయి. ఆసక్తి ఉండి కూడా, పద్యాలు చదివి అర్థం చేసుకునే అవకాశం, తీరిక, ఓపిక చాలా మందికి తెలుగు వారికే ఉండదు.
     అలాంటి వాళ్ళు మన భాషలోని అందాన్ని, మన సాహిత్యంలోని స్వారస్యాన్ని ఆస్వాదించలేకపోతున్నారు.
       టూకీగా ఆ కావ్యాల కథలను చాలామంది వ్రాశారు. కానీ వాటిలోని అద్భుతమైన వర్ణనలను వదిలేస్తున్నారు. కొంతమంది కావ్యాలలోని వర్ణనలను కొన్నింటిని వ్యాసాల రూపంలో వ్రాశారు.
       కథా వర్ణనలతో సహా ఏవీ వదలకుండా సరళమైన తెలుగులో వ్రాసి అందించాలనిపించింది.
        2015 లో తెలుగు సాహిత్యంలో అభిరుచి ఉన్న మిత్రులు "తెలుగు వెలుగు" అని ఒక వాట్స్ యాప్ సమూహాన్ని ప్రారంభించారు. ఇక మొదట పోతన మహాకవి భాగవతం ఆధారంగా "దశావతారాలు"తో ప్రారంభించి,
రోజూ ఒక పేజీ చొప్పున పంపండం మొదలు పెట్టాను.
మంచి ప్రోత్సాహం లభించింది. 
        అలా ప్రారంభించి వరుసగా నాలుగు సంవత్సరాలలో,
1. దశావతార కథలు,
2. సుందర కాండ,
3. మాలదాసరి కథ,
4. ముక్కు తిమ్మన పారిజాతాపహరణం,
5. దిజ్ఞ్నాగుడి సంస్కృత నాటకం కుందమాల
6. గురుచరిత్ర
7. కాళహస్తి మాహాత్మ్యం
8. ఇంకా ఈ కథల ఆధారంగా కొన్ని గేయాలు, పదాలు..
       --వీటిని తెనిగించి తెలుగు వెలుగు బృందానికి పంపాను. 
        ఇవన్నీ ఇంకా చాలామంది చదవాలి అని సంకల్పంతో మా అమ్మాయి చి.ల.సౌ.సంకా ఉషారాణి వీటిని బ్లాగులో పెడితే బాగుంటుంది అని చెప్పింది. ఆ పనిలో ఆమె సహాయం శ్లాఘనీయం ‌. ఆమెకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి, ఇంకా ఎక్కువగా సంస్కృతాంధ్ర భాషా సరస్వతిని సేవించే శక్తి ప్రసాదించు గాక.
ఇతి శివమ్

---
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి